ఆసక్తి రేకిత్తిస్తున్న అక్షయ్‌ రామ్‌ సేతు టీజర్‌

109
akshay
- Advertisement -

రామ్‌సేతు విశిష్టత దాన్ని కాపాడేందుకు తన బృందంతో కలసి ఓ ఆర్కియాలజిస్ట్‌ చేసే సాహసోపేతమైన ప్రయాణాన్ని ఆధారంగా చేసుకొని రూపుదిద్దుకున్న చిత్రం రామ్‌సేతు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ఈ చిత్రంను మూవీ మేకర్స్‌ సోమవారం  ఫస్ట్‌ టీజర్‌ను  విడుదల చేశారు. పూర్తిగా యాక్షన్‌ అడ్వెంచర్‌గా రాబోతున్న ఈ మూవీ అక్టోబర్ 25, 2022న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

“రామసేతును రక్షించడానికి మాకు 3 రోజులు మిగిలి ఉన్నాయి” అని అక్షయ్ చెప్పడంతో మొదలైన ఈ టీజర్‌…ఆకట్టుకునే విజువల్స్‌ తో కట్టిపడేసేలా ఉంది. రామ్‌సేతుని చేరుకొవాడానికి తన బృందంతో కలిసి అక్షయ్‌ చేసే సహసాలను ఇందులో చూపించారు. అభిషేక్ శర్మ రచించి దర్శకత్వం వహించిన… ఈ సినిమాలో ఆక్షయ్‌కుమార్‌, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సత్యదేవ్‌, నుష్రత్‌ బారుచా, నాజర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

- Advertisement -