టీమిండియా..దృశ్యం సినిమాకు లింక్

310
- Advertisement -

ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఘోర పరాజయం పాలైంది. ఇంగ్లండ్ ఓపెనర్‌ అలెక్స్ హేల్స్‌ జోస్ బట్లర్ సెంచరీ భాగస్వామ్యం కారణంగా భారత్ 10వికెట్ల తేడాతో ఓడిపోయింది. టాస్‌ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ ఓపెనింగ్ జోడి పూర్తిగా విఫలమైంది. సెకండ్ ఆర్డర్లో వచ్చిన విరాట్ హర్థిక్ కారణంగా టీమిండియా 168 పరుగులు చేయగలిగింది.

కానీ ఇంగ్లండ్ ఓపెనర్లు మ్యాచ్‌ గెలిపించారు. దీంతో సోషల్‌ మీడియాలో భారత ఆటగాళ్లపై ఫైర్ అవుతున్నారు. అలాగే జోక్స్ పేల్చుతూ ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రస్తుతవ సోషల్ మీడియాలో #indvseng ట్యాగ్ ట్రెండింగ్‌లో నడుస్తోంది. మరీ ముఖ్యంగా రోహిత్‌ శర్మ కేఎల్ రాహుల్‌ సూర్యకుమార్ యాదవ్‌ల మీద ట్రోల్స్ గుట్టలుగుట్టలగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ లో పంపిస్తూ టీమిండియాను ఒక ఆట ఆడుకుంటున్నారు. వాళ్లకి ఆట ఏలా ఆడాలో నేర్పిస్తున్నామని మరికొందరు అంటున్నారు.

కొంతమంది దినేష్‌ను తప్పించడం వల్ల బతికిపోయావని మరికొందరు కేఎల్‌ రాహుల్‌ను తప్పించాలని అంటున్నారు. ఇంకొందరు చాహల్ లాంటి తెలివైన బౌలర్ను ఆస్ట్రేలియాకు తీసుకెళ్లినా ఉపయోగించుకోలేదని మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన ట్రోల్స్ మీమ్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా దృశ్యం సినిమాలోని డైలాగ్స్‌ ను వాడుకుంటూ విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. వాటిలో కొన్ని మీకోసం..

” ఈరోజు గురువారం, match చూడలేదు.. అస్సలు మాకు match ఉన్నదనే విషయం కూడా తెలియదు.”

‘ గురువారం కాబట్టి, సాయిబాబా వారి పాటలు వింటూ మా పనులు చేసుకున్నాం. అంతకుమించి మాకేం తెలియదు సార్.’

” ఎవరు అడిగిన కూడ, మీరు అందరూ ఇదే చెప్పాలి.” దృశ్యంలోని వెంకటేష్ డైలాగ్‌లను గుర్తు చేస్తున్నారు.

“బాగా గుర్తుంచుకొండి, ఎవ్వరు అడిగినా ఒకేలా చెప్పాలి…. ‘‘మన టీవీ రిపేరులో ఉంది, అందుకే మనం క్రికెట్ మ్యాచ్ చూడలేకపోయాం, డీటీహెచ్ కనెక్షన్ ఉండేది’’ . . ‘‘దృశ్యం-3 సినిమాలో ఓ దృశ్యం’’

“ఆ.. ఓడింది రిషి సునాక్ చేతిలోనేగా.. అనుకుంటే.. మనసుకి ప్రశాంతంగా ఉంటుంది ప్రెండ్స్.”

“కటకటా… ఎట్టెట్టా.. ఆ తెల్లతోళ్ల దొరలు మరోసారి భారత్-పాక్ ను విడదీశారు (కొట్టుకోకుండా).”

- Advertisement -