Covid: కరోనా అప్‌డేట్

10
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. గత 24 గంటల్లో 391 కొత్త కేసులు నమోదుకాగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 5,755కు పెరిగింది. ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకూ 391 మందికి పాజిటివ్‌గా తేలింది.

ప్రస్తుతం దేశంలో 5755 కేసులు యాక్టివ్‌గా ఉండగా 5,484 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కేరళలో 1806 యాక్టివ్‌ కేసులు ఉండగా గుజరాత్‌లో 717, ఢిల్లీలో 665, పశ్చిమ బెంగాల్‌లో 622, మహారాష్ట్రలో 577, కర్ణాటకలో 444 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

ఏపీలో 72, తెలంగాణలో 9 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

Also Read:ఘనంగా బక్రీద్ వేడుకలు…

- Advertisement -