గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ను పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ ఉదయం అమెరికా పర్యటనను ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న కేటీఆర్.. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, పార్టీ నాయకులతో కలిసి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌న్ పరామర్శించారు.
ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్నా కూడా మాగంటి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు కేటీఆర్.
గురువారం గుండెపోటుకు గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానకు తరలించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి హాస్పిటల్‌లోనే చికిత్స అందిస్తున్నారు.
Also Read:ఘనంగా బక్రీద్ వేడుకలు…

