దేశంలో 24 గంటల్లో 25,153 కరోనా కేసులు..

229
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య కోటి దాటింది. గత 24గంటల్లో 25,153 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 347 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు 95,50,712 మంది కోలుకొని డిశ్చార్జి కాగా ప్రస్తుతం దేశంలో 3,08,751 యాక్టివ్‌ కేసులున్నాయి.

కరోనాతో ఇప్పటి వరకు 1,45,136 మంది మృతిచెందగా ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 95.46శాతంగా ఉంది. గత 24 గంటల్లో 11,71,868 శాంపిల్స్‌ పరీక్షించగా ఇప్పటి వరకు 16,00,90,154 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.అమెరికా తర్వాత కోటి కరోనా వైరస్‌ కేసులను దాటిన రెండో దేశంగా భారత్‌ నిలిచింది.

- Advertisement -