మోడర్నా టీకాకు అమెరికా గ్రీన్ సిగ్నల్…

96
moderna

కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న అమెరికా ప్రజలకు ఇది మరో గుడ్ న్యూస్‌. ఇప్పటికే ఫైజర్ టీకా అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమతిచ్చిన ట్రంప్ సర్కార్ ఇప్పుడు రెండో టీకాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అత్య‌వ‌స‌ర వినియోగానికి మోడెర్నాటీకాకు అనుమ‌తి ఇచ్చింది. ట్ర‌య‌ల్స్ విజ‌య‌వంతం కావడంతో అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి ఇవ్వాలంటూ మోడర్నా వ్యాక్సిన్ త‌యారీ సంస్థ పెట్టుకున్న ద‌ర‌ఖాస్తుకు స్పందించిన అమెరికా ఆహార‌, ఔష‌ధ నియంత్ర‌ణ సంస్థ ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దీంతో త్వ‌ర‌లోనే మోడార్నా టీకా వినియోగంలోకి రానుంది. ఇక ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్ పంపిణీ కూడా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే.