తెలంగాణ కరోనా అప్‌డేట్..

33
corona

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 81 వేలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 627 పాజిటివ్ కేసులు నమోదు కాగా నలుగురు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసులు సంఖ్య 2,80,822కు చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 6942 యాక్టివ్ కేసులుండగా 2,72,370 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకు 1,489 మంది కరోనాతో మృతిచెందారు. కరోనా మరణాలు దేశంలో 1.5 శాతంగా ఉంటే రాష్ట్రంలో 0.53 శాతంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు 64,01,082 కరోనా టెస్టులు చేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.