దేశంలో 3 లక్షలకు చేరువలో కరోనా మరణాలు..

61
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పడ్డాయి. గత 24 గంటల్లో 2,40,842 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 3,741 మంది వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 2,65,30,132కు చేరగా ఇప్పటి వరకు 2,34,25,467 మంది కరోనా నుండి కోలుకున్నారు.

కరోనాతో 2,99,266 మంది ప్రాణాలు కొల్పోగా ప్రస్తుతం దేశంలో 28,05,399 యాక్టివ్‌ కేసులున్నాయి. టీకా డ్రైవ్‌లో ఇప్పటి వరకు 19,50,04,184 డోసులు వేయగా ఇప్పటి వరకు 32.86కోట్ల నమూనాలను పరిశీలించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.