భారత ప్రయాణాలపై నిషేధం…

147
kenada
- Advertisement -

జూన్ 21 వరకు భారత్ నుండి విమాన ప్రయాణాలను నిషేధిస్తున్నట్లు తెలిపింది కెనడా ప్రభుత్వం. జూన్‌ 21 వరకూ ఈ నిషేధం కొనసాగుతుందని, అప్పటి వరకూ భారత్, పాక్‌ల నుంచి డైరెక్టు విమానాలు ఉండవని వెల్లడించింది.

భారత్ – పాక్‌ దేశాల ప్రజలు ఏదైనా మూడో దేశం మీదుగా తమ దేశంలోకి చేరుకోవడానికి మాత్రం అనుమతి ఇచ్చింది. కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగానే నిషేధం పొడిగించినట్లు పేర్కొంది.

అత్యవసర వస్తువులు, వ్యాక్సిన్లు, ఇతర మెడికల్‌ సంబంధమైన వాటిని రవాణా చేసేందుకుగానూ కార్గో ఫ్లైట్లు తిరుగుతాయని స్పష్టం చేసింది. ప్రజల ప్రాణాలను కాపాడటం ప్రభుత్వం బాధ్యత అని అందుకే నిషేధం పొడిగించినట్లు ఆ దేశ రవాణా శాఖ మంత్రి ఒమర్‌ అల్‌ఘాబ్రా చెప్పారు.

- Advertisement -