అజయ్‌ దేవగణ్‌తో కలిసి మొక్కలునాటిన ఎంపీ సంతోష్

37
santhosh

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ మూడేండ్లుగా అప్రతిహతంగా కొనసాగుతుందన్నారు ఎంపీ సంతోష్ కుమార్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురంలోని పారిశ్రామిక పార్కులో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌తో కలిసి ఆయన మొక్కలు నాటారు.ఎన్‌వై ఫౌండేషన్‌ ద్వారా ఇతర రాష్ట్రాల్లో కూడా గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ను ముందుకు తీసుకుపోతామని అజయ్‌ దేవగన్‌ చెప్పడం హర్షించదగిన విషయమన్నారు.

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో సహా అన్ని రంగాల ప్రముఖులు, సెలబ్రెటీలు ఈ చాలెంజ్‌లో పాల్గొంటున్నారని తెలిపారు సంతోష్. మొక్కలు నాటుతూ ప్రజల్లో ఉత్సాహాన్ని, స్ఫూర్తిని నింపుతున్నారని వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ బాలమల్లు, తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు సుధీర్‌ రెడ్డి పొల్గొన్నారు.