దేశంలో 24 గంటల్లో 16,375 కరోనా కేసులు..

59
India coronavirus

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. దేశంలో గత 24 గంటల్లో 16,375 కరోనా కేసులు నమోదు కాగా 201 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,03,56,845కు చేరాయి.

ప్రస్తుతం దేశంలో 2,31,036 యాక్టివ్‌ కేసులుండగా 99,75,958 మంది కరోనా నుండి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 1,49,850 మంది మృత్యువాతపడ్డారు. గత 24 గంటల్లో 8,96,236 కరోనా టెస్టులు నిర్వహించగా ఇప్పటివరకు 17,65,31,997 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.