రామతీర్థంలో హై టెన్షన్‌!

28
ramatheertham

ఏపీలోని రామతీర్థంలో హైటెన్షన్ నెలకొంది. రామతీర్ధం ఘటనపై సీఐడీ విచారణకు సీఎం జగన్ ఆదేశించడంతో విచారణ ప్రారంభమైంది. క్షేత్ర స్ధాయిలో ఘటనపై సమాచారాన్ని సేకరిస్తున్నారు సీఐడీ అధికారులు. తొలుత సమాచారం ఎలా వెలుగులోకి వచ్చింది అన్నదానిపై అడిగి తెలుసుకుంటున్నారు.

సీఐడీ విచారణ నేపథ్యంలో రామతీర్థం ఆలయ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఆలయ సమీపంలో సభలు, సమావేశాలకు అనుమతిలేదని డీఎస్పీ సునీల్‌ తెలిపారు. రామతీర్థంలో సెక్షన్ 30 అమలుచేస్తున్నామని, ఎవరూ చట్టాలను అతిక్రమించవద్దని, చట్టాలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మరోవైపు రామతీర్ధం వైపు ఎవరు వెళ్లకుండా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.