మెట్రో సేవలకు అంతరాయం..

21
hmr

హైదరాబాద్‌ మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపం తలెత్తడంతో ఎల్బీనగర్ టూ మియాపూర్,నాగోల్- రాయదుర్గం మార్గాల్లో మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అసెంబ్లీ స్టేషన్ వద్ద మెట్రో రైలులో సాంకేతిక సమస్య తలెత్తడంతో నిలిచిపోగా ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో.. ఉద్యోగులు, ఇతర పనులపై వెళ్లేవాళ్లు మెట్రోలో చిక్కుకుపోయారు.