దేశంలో కోటికి చేరువలో కరోనా కేసులు..

202
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య కోటికి చేరువయ్యాయి. గత 24 గంటల్లో 24,010 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 335 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 99,56,558కు చేరింది.

ప్రస్తుతం దేశంలో 3,22,366 యాక్టివ్ కేసులుండగా 94,89,740 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 1,44,451 మంది మృతిచెందారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 18,86,807 కేసులు నమోదుకాగా 48,434 మంది మరణించారు.

- Advertisement -