సీ బ్యాండ్ సేవల విస్తరణకు పీఎస్‌ఎల్వీ సీ-50

60
pslv c50

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి మరో ప్రయోగానికి సిద్ధమైంది ఇస్రో. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 52వ రాకెట్‌ను నింగిలోకి పంపడానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం 3.41 గంటలకు పీఎ‌స్‌‌ఎ‌ల్‌‌వీ-సీ50 రాకెట్‌ను ప్రయోగించనుంది.

ఈ రాకెట్‌ 44.4 మీ ఎత్తు ఉండగా, 2.8 మీటర్ల వ్యాసం ఉన్నది. 320 టన్నుల బరువున్న ఈ వాహక నౌక నాలుగు దశల్లో అంతరిక్షంలోకి చేరుతుంది. అదేవిధంగా భూబదిలీ కక్ష్యలోకి 1,425 కిలోలు, సూర్యానువర్తన కక్ష్యలోకి 1750 కిలోల బరువును మోసుకెళ్లగలుగుతుంది. ఈ వాహక నౌక ద్వారా కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ వ్యవస్థ సీఎం‌ఎస్‌–01ను అంత‌రి‌క్షం‌లోకి పంపిచనుంది. ఇది సీ-బ్యాండ్‌ సేవల విస్తరణకు దోహదపడనున్నది.

2011లో ప్రయోగించిన జీశాట్‌-12 కాలపరిమితి ముగిసిపోవడంతో దానిస్థానంలో జీశాట్‌-12ఆర్‌ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టాలని ఇస్రో నిర్ణయించింది. అయితే ప్రస్తుతం దాని పేరును సీఎంఎస్‌-01గా మార్చి కక్ష్యలోకి చేరవేస్తున్నారు.