మొక్కలు నాటిన డీఎస్పీ బోనాల కిషన్‌..

45
gic

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా డీఎస్పీ బోనాల కిషన్. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా డిఎస్పీ బోనాల శంకర్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటిన ములుగు జిల్లా ఎస్ పి సంగ్రామ్ సింగ్ పాటిల్ గారు విసిరినా చాలెంజ్ ని స్వీకరించి మొక్కలు నాటడం జరిగిందన్నారు.

మొక్కలు నాటడం చాలా అనందంగా ఉంది గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక ఆధ్బుతమైన కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకుంటున్న చొరవ భావితరాలకు బంగారు బాట , దూరదృష్టి తో బాధ్యాయుతంగా హరిత హారం చేపట్టి మొక్కలు నాటి వాటిని కాపాడే విదంగా చట్టం తగీసుకురావడం అయన మొక్కల పెంపకం పైన బాధ్యత అద్దం పడుతుందన్నారు.

దీనికి మద్దతుగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్రమంతటా అవగాహాన కల్పిస్తుంది , ఇంతటి మంచి కార్యక్రమం చేపట్టిన సంతోష్ కుమార్ గారిని ప్రత్యేకంగా అభినందించారు ఈ చాలెంజ్ సంపత్ రావు డిఎస్పీ భూపాలపల్లి మరియు స్థానిక సీఐ లకూ చాలెంజ్ విసరడం జరిగిందన్నారు.