- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య 8వేలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 200కి పైగా కొత్త కేసులు నమోదుకాగా కరోనాతో 87 మంది మృతిచెందారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకూ దేశంలో 269 కొత్త కేసులు బయటపడ్డాయి.
అత్యధికంగా కర్ణాటకలో 132 కేసులు వెలుగు చూడగా దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,400కి చేరాయి. అత్యధికంగా కేరళ రాష్ట్రంలో 2,109 కేసులు యాక్టివ్‌గా ఉండగా గుజరాత్‌లో 1,437, పశ్చిమ బెంగాల్‌లో 747, ఢిల్లీలో 672, మహారాష్ట్రలో 613, కర్ణాటకలో 527 కేసులు ఉన్నాయి.
కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 11 వేలు దాటింది.
Also Read:కమల్‌పై మరోసారి హైకోర్టు తీవ్ర ఆగ్రహం
- Advertisement -

