Sreeleela:శ్రీలీల బర్త్ డే స్పెషల్

13
- Advertisement -

పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన మ్యూటీ శ్రీలీల. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది. మహేష్ బాబుతో కలిసి చేసిన గుంటూరు కారంతో ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ కాగా ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉంది.

ఇక ఇవాళ శ్రీలీల బర్త్ డే సందర్భంగా ఉస్తాద్ భగత్ సింగ్ టీమ్ స్పెషల్ విషెస్ తెలిపింది. ఓ పోస్టర్‌ను రిలీజ్ చేయగా ఈ పోస్ట‌ర్‌లో శ్రీలీల చాలా క్యూట్‌గా కనిపిస్తోంది. చేతిలో కాఫీ క‌ప్ ప‌ట్టుకుని నిలుచొని సింపుల్ లుక్‌తో అద‌ర‌గొడుతుంది. శ్రీలీల లుక్ త‌న అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న మాస్ జాత‌ర‌ , అఖిల్‌తో లెనిన్‌ , శివ కార్తికేయ‌న్ తో ప‌రాశ‌క్తి , కార్తీక్ ఆర్య‌న్‌ తో ఆషిఖి 3 , కిరీటి రెడ్డి హీరోగా తెలుగు, క‌న్న‌డ ద్విభాషా చిత్రం జూనియ‌ర్ చిత్రాల్లో న‌టిస్తోంది.

Also Read:సీఎం రేవంత్‌ రెడ్డిపై కేసు ఏది?

- Advertisement -