దేశంలో 24 గంటల్లో 55,342 కరోనా కేసులు…

129
telangana corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 55,342 కొత్త కేసులు నమోదుకాగా 706 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 71,75,881 కి చేరింది.

ప్రస్తుతం దేశంలో 8,38,729 యాక్టివ్ కేసులుండగా 62,27,296 మంది కరోనా నుండి కొలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో ఇప్పటివరకు 1,09,856 మంది మృతిచెందారు. దేశంలో రోజుకు కరోనా టెస్టుల సంఖ్య 10 లక్షలకు పైగా ఉండగా ఇప్పటివరకు 8 కోట్ల 50 లక్షలు దాటాయి. నిన్న ఒక్కరోజే 77, 760 మంది బాధితులు కోలుకోగా దేశవ్యాప్తంగా రికవరీ రేటు 86.78%, మరణాల రేటు 1.53%గా ఉంది.