రాష్ట్రంలో 24 గంటల్లో 1708 కరోనా కేసులు…

102
telangana coronavirus

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 1708 పాజిటివ్ కేసులు నమోదుకాగా 5 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,14,792 కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 24,208 యాక్టివ్ కేసులుండగా 1,89,351 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 1233 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 277, భద్రాద్రి కొత్తగూడెంలో 97, కరీంనగర్లో 86,ఖమ్మం లో 81, మేడ్చల్ లో 124, నల్గొండలో 81, రంగారెడ్డిలో 137 కేసులు నమోదయ్యాయి.