- Advertisement -
దేశంలో కరోనా మహమ్మారి ఉదృతి రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 22,752 పాజిటివ్ కేసులు నమోదుకాగా 482 మంది మృతిచెందారు.
దేశంలో ఇప్పటివరకు 7.42 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 20,642 మంది మృతిచెందారు. దేశంలో కరోనా వైరస్ రికవరీ రేటు 61 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇందులో 2,64,944 కేసులు యాక్టివ్ గా ఉంటే, 4,56,830 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో 2,62,679 కరోనా టెస్టులు నిర్వహించగా మొత్తంగా 1,04,73,771 టెస్టులు నిర్వహించారు. ఇక ప్రపంచదేశాల్లో కరోనా కేసుల్లో భారత్ మూడో స్ధానంలో ఉండగా భారత్ కంటే ముందు అమెరికా, బ్రెజిల్ మాత్రమే ముందున్నాయి.
- Advertisement -