బంగారం ప్రియులకు షాక్!

262
gold rate
- Advertisement -

కొంతకాలంగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గినా దేశీయ మార్కెట్‌లో పెరగడం విశేషం. హదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.210 పెరిగి రూ.54,060కు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.210 పెరిగి రూ.49,580కు చేరింది.

బంగారం ధర పెరిగితే వెండి ధర పడిపోయింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.600 తగ్గి రూ.67,900కు చేరాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.14 శాతం తగ్గుదలతో 1959 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 0.36 శాతం తగ్గుదలతో 27.03 డాలర్లకు చేరింది.

- Advertisement -