- Advertisement -
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22 లక్షలకు చేరువయ్యాయి. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య 60 వేలకు పైగా నమోదవుతుండటం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది.
గత 24 గంటల్లో కొత్తగా 64,399 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 861 మంది మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,53,011కు చేరగా 43,379 మంది మృత్యువాతపడ్డారు.
ప్రస్తుతం దేశంలో 6,28,747 యాక్టివ్ కేసులు ఉండగా 14,80,885 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 68.3 శాతంగా ఉన్నందని తెలిపింది. రోజుకు 6 లక్షలకు పైగా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది.
- Advertisement -