సర్కార్ వారి పాట…మహేశ్ బర్త్ డే గిఫ్ట్

256
mahesh sarkarvari paata
- Advertisement -

ప్రిన్స్ మహేశ్‌ బాబు 45వ పుట్టినరోజు సందర్భంగా సినీ,రాజకీయ ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక తాజాగా మహేశ్‌ నటిస్తున్న చిత్రం సర్కార్ వారి పాట నుండి బర్త్ డే ట్రీట్ ఇచ్చారు దర్శకుడు పరశురాం.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజైన పోస్టర్‌కి మంచి రెస్పాన్స్‌ రాగా మహేశ్‌ బర్త్ డే సందర్భంగా మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు.మ‌హేష్ కాయిన్‌ని గాల్లోకి ఎగిరివేయ‌డాన్ని ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. చేతికి ఓం అనే లాకెట్ కూడా టీజ‌ర్‌లో గ‌మ‌నించ‌వ‌చ్చు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మహేశ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -