కరోనా…ఆసియాలో అగ్రస్ధానంలో భారత్!

305
india corona cases
- Advertisement -

కరోనా మహమ్మారి రోజురోజుకు దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ 7వ స్ధానంలో నిలవగా ఆసియాలో అగ్రస్ధానంలో నిలిచింది.

గత 24 గంటల్లో దేశంలో రికార్డుస్థాయిలో 8,392 మందికి కొత్తగా కరోనా సోకగా, 230 మంది మరణించారని ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,90,535గా నమోదుకాగా ఇందులో 93,322 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 91,819 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ కాగా 5394 మంది మృతిచెందారు.

- Advertisement -