దేశంలో 24 గంటల్లో 17,407 కరోనా కేసులు..

66
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగిపోతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 17,407 కరోనా కేసులు నమోదుకాగా 89 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,56,923కి చేరింది.

ప్రస్తుతం దేశంలో 1,73,413 యాక్టివ్ కేసులుండగా 1,08,26,075 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 1,57,435కి చేరింది. ఇప్పటి వరకు మొత్తం 1,66,16,048 మందికి వ్యాక్సిన్ అందించగా దేశంలో ప్రస్తుతం రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.