పొలార్డ్ సంచలనం…ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు

78
pollard

శ్రీలంక టూర్‌లో సంచలనం సృష్టించాడు వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ పొలార్డ్. ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు బాధి గిబ్స్, యువరాజ్ సరసన నిలిచాడు.శ్రీలంక బౌలర్ అకిల ధనంజయ వేసిన ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టి సత్తా చాటాడు.

టీ20ల్లో ఈ ఘ‌న‌త సాధించిన మూడో బ్యాట్స్‌మ‌న్ పొలార్డ్‌. అంత‌కు ముందు నెద‌ర్లాండ్స్‌పై గిబ్స్ తొలిసారి ఈ ఘ‌న‌త సాధించ‌గా.. 2007 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో యువ‌రాజ్‌.. బ్రాడ్ బౌలింగ్‌లోనూ ఆరు సిక్స‌ర్లు బాదాడు.

132 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి విండీస్ 3.1 ఓవ‌ర్లో వికెట్ న‌ష్ట‌పోకుండా 52 ప‌రుగులు చేసి మెరుపు ఆరంభాన్ని అందుకుంది. ఈ స‌మ‌యంలో బౌలింగ్‌కు దిగిన ధ‌నంజ‌య వ‌రుస బంతుల్లో ఎవిన్ లూయిస్‌, క్రిస్ గేల్‌, నికోల‌స్ పూర‌న్‌ను ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. అయితే ఆ ఆనందం ఎక్కువ సేపు నిల‌వ‌లేదు. ఆ త‌ర్వాతి ఓవ‌ర్లోనే పొలార్డ్ అత‌ను వేసిన ఆరు బంతుల్లో ఆరు సిక్స‌ర్లు బాది చుక్కలు చూపించాడు.