- Advertisement -
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 38,902 పాజిటివ్ కేసులు నమోదుకాగా 543 మంది మృతిచెందారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,77,618కు చేరగా 26,816 మంది మృతిచెందారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3,73,379 మంది చికిత్స పొందుతుండగా 6,77,423 మంది బాధితులు కోలుకున్నారు.
జూలై 18 వరకు 1,37,91,869 టెస్టులు నిర్వహించామని…దేశంలో నిన్న 3,58,127 నమూనాలు పరీక్షించామని ఐసీఎంఆర్ వెల్లడించింది. దేశంలో కరోనా రికవరీ రేటు 62.93 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.
దేశంలో అత్యధికంగా పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో 3,00,937 కరోనా నమోదవగా, 11,596 మంది మరణించారు. ఢిల్లీలో ఇప్పటివరకు 1,21,582 మంది కరోనాబారిన పడగా కరోనా వైరస్‌తో 3597 మంది మరణించారు.
- Advertisement -