దేశంలో 90 లక్షలు దాటిన కరోనా కేసులు…

83
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 45,882 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 584 మంది మృతి చెందారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 90,04,366కు చేరింది.

ప్రస్తుతం దేశంలో 4,43,794 యాక్టివ్ కేసులు ఉండ‌గా, 84,28,410 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 1,32,162 మంది మ‌ర‌ణించారు.

గత 24 గంటల్లో 10,83,397 కరోనా టెస్టులు చేయగా మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 12,95,786కు చేరింద‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి (ఐసీఎమ్మార్‌) ప్ర‌క‌టించింది.