ట్రంప్ పై మరోసారి ఫైర్అయిన బైడెన్

84
trump

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై మరోసారి తనదైనశైలీలో మండిపడ్డారు ఎలక్టెడ్ ప్రెసిడెంట్ జో బైడెన్‌. అమెరికా అధ్యక్ష చరిత్రలో ట్రంప్ అత్యంత బాధ్యతాయుతమైన దేశాధ్యక్షుడిగా మిగిలిపోతారని దుయ్యబట్టారు. అధికార బదలాయింపును ఆలస్యం చేస్తూ ట్రంప్‌ నమ్మశక్యం కాని బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శిస్తున్నారని వెల్లడించారు.

ప్రజాస్వామ్యం ఎలా పని చేస్తుందో ఇతర ప్రాంతాలకు హానికరమైన సందేశం వెళ్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో రగ్గింగ్‌ జరిగిందన్న ఆరోపణలను ఖండించారు బైడెన్.

ఆ మనిషి ఎలా ఆలోచిస్తాడు అనే విషయం చెప్పడం కాలా కష్టం. అతను గెలువలేదు.. గెలవబోడం లేదు… జనవరి 20న తాను నూతన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోడుతున్నానని స్పష్టం చేశారు. కరోనా టీకా పంపిణీ మనం ఎదుర్కొనే గొప్ప కార్యాచరణ సవాళ్లలో ఒకటి అని అన్నారు.