నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు…

22
ghmc

గ్రేటర్ ఎన్నికల నామినేషన్ గడువు నేటితో ముగియనుంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో వివిధ పార్టీల నేతలు నామినేషన్లు దాఖలు చేయగా నేడు చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం ఉంది.

ఇప్ప‌టివర‌కు 537 మంది అభ్య‌ర్థులు 597 నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్ప‌టికే 125 డివిజ‌న్ల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. మ‌రో 25 డివిజ‌న్ల‌కు ఇవాళ త‌మ అభ్య‌ర్థుల జాబిత‌ను విడుద‌ల చేయ‌నుంది. అదేవిధంగా 44 సిట్టింగ్ స్థానాల్లో పోటీ చేయాల‌ని ఎంఐఎం నిర్ణ‌యించింది. దీంతో ఈ స్థానాల‌కు ఇవాళ‌ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌నుంది.

కాంగ్రెస్,బీజేపీలు కూడా ఇవాళ తుది జాబితాను విడుదల చేసి తమ అభ్యర్థులకు బీ ఫామ్ అందజేయనుంది.