దేశంలో 82 లక్షలు దాటిన కరోనా కేసులు..

100
coronavirus

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82 లక్షలు దాటాయి. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 45,230 పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 496 మంది మృతిచెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 82,29,313కు చేరింది.

ప్రస్తుతం 5,61,908 యాక్టివ్ కేసులుండగా 75,44,798 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనా నుండి 1,22,607 మంది కోలుకున్నారు.

గత 24 గంటల్లో 8,55,800 కరోనా టెస్టులు చేయగా ఇప్పటివరకు 11,07,43,103 టెస్టులు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా రికవరీ రేటు 91.68 శాతానికి చేర‌గా, మ‌ర‌ణాల రేటు 1.49 శాతంగా ఉంద‌ని తెలిపింది.