బిగ్ ట్విస్ట్…మాస్టర్ సేఫ్‌!

199
ammarajashekar
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 57 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుంది. 57వ ఎపిసోడ్‌లో భాగంగా చివరివరకు ట్విస్ట్ ఇస్తూ వచ్చిన నాగార్జున….ఈ వారం ఎలిమినేషన్‌ లేదని ప్రకటించడమే కాదు వచ్చేవారం కెప్టెన్ పోటీ దారుడిగా డైరెక్ట్‌గా అమ్మా రాజశేఖర్ మాస్టర్ నామినేట్ అయినట్లు ప్రకటించి పెద్ద ట్వీస్ట్ ఇచ్చారు.

ఎలిమినేషన్ ప్రక్రియలో చివరగా అమ్మా రాజశేఖర్- మెహబూబ్ ఉండగా మెహబూబ్‌తో పోలిస్తే మాస్టర్‌కు ఇంటిలో ఉండే అర్హత లేదని అఖిల్, అభిజీత్, సోహెల్, లాస్య, మోనాల్, హారిక అభిప్రాయపడ్డారు. ఇక మాస్టర్‌కు మద్దతుగా అరియానా,అవినాష్ ఓట్లు వేయడంతో ఈ వారం ఇంటి నుండి మాస్టర్ బయటకు వెళ్తున్నారని బిగ్ ట్విస్ట్ ఇచ్చారు నాగ్.

దీంతో హౌస్‌లోకి వచ్చి తన లగేజ్‌ సర్దుకుని బయటకు వెళ్తున్న మాస్టర్‌ని ఆపిన నాగ్‌…అదిరే ట్విస్ట్ ఇచ్చారు. నోయల్ విజ్ఞప్తి మేరకు ఈ వారం ఎలిమినేషన్ లేదని …ఎక్కువ మంది రాజశేఖర్‌కు వ్యతిరేకంగా ఓటేసినందుకు ఆయన్ని నెక్ట్స్ వీక్ కెప్టెన్సీకి డైరెక్ట్ కంటెండర్‌ను చేశారు నాగార్జున. దీన్ని రాజశేఖర్ కూడా నమ్మలేకపోయారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన నాగార్జునకు రాజశేఖర్ ధన్యవాదాలు తెలిపారు. ఒకసారి మీ పాదం ముందుకు పెట్టండి బాబు అంటూ పాదాభివందనం చేయగా నాగార్జున మాత్రం షేక్ హ్యాండ్ చాలు అని హుందాతనాన్ని ప్రదర్శించారు.

- Advertisement -