జర్మనీలో నేటి నుండి లాక్‌ డౌన్‌..

106
lockdown

కరోనా రెండోదశ విజృంభించే అవకాశం ఉండటంతో పలు దేశాలు తిరిగి లాక్ డౌన్ బాటపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు దేశాలు లాక్ డౌన్ ప్రకటించగా నేటి నుండి జర్మనీలో పాక్షిక లాక్ డౌన్‌ అమల్లోకి రానుంది.

ఫెడరల్ ప్రభుత్వం సోమవారం నుంచి కనీసం రెండు వారాలపాటు మొత్తం దేశాన్ని లాక్ చేయడానికి రాష్ట్రాలతో ఒక ఒప్పందానికి వచ్చిందని చెప్పారు జర్మన్ చాన్స్‌లర్‌ ఏంజెలా.

ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్‌ని విడుదల చేశారు. రెస్టారెంట్లు, బార్లు మూసివేస్తారు. టేక్‌ అవేకు అవకాశం ఉంటుందని వెల్లడించారు.పెద్ద పెద్ద సమావేశాలు రద్దు….అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రయాణాలపై నిషేధం విధించారు. ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం కేటాయించగా….పది మందితో రెండు కుటుంబాలు మాత్రమే కలిసి శుభకార్యాలు చేసుకునేందుకు అనుమతిచ్చారు.