దేశంలో 74 లక్షలు దాటిన కరోనా కేసులు..

93
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రోజుకు 60 వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో కేసుల సంఖ్య 74 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 62,212 క‌రోనా పాటివ్ కేసులు న‌మోదు కాగా 837 మంది మృతిచెందారు.

దీంతో దేశంలో ఇప్పటివరకు క‌రోనా కేసుల సంఖ్య 74,32,681కు చేరగా 7,95,087 యాక్టివ్ కేసులున్నాయి. 65,24,596 మంది క‌రోనా నుంచి కోలుకోగా 1,12,998 మంది మృతిచెందారు.