దుర్గమ్మకు మొక్కు చెల్లించిన మంత్రి హరీశ్‌ రావు…

49
harish rao

మెదర్‌ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకున్నారు మంత్రి హరీశ్ రావు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం దుర్గామాత ఆలయాన్ని సందర్శించిన హరీశ్ ….అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మొక్కు చెల్లించి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించి… ముక్కు పుడక సమర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు.

అంతకుముందు ఆలయానికి చేరుకున్న మంత్రి హరీశ్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఆలయ అధికారులు. అనంతరం అమ్మవారి ఆశీర్వచనంతోపాటు తీర్థప్రసాదాలు అందజేశారు.