దేశంలో 8 కోట్ల 22 లక్షలు దాటిన కరోనా టెస్టులు..

174
india coronacases

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రోజుకు 70 వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో ప్రస్తుతం కేసుల సంఖ్య 67 లక్షలు దాటాయి.

గత 24గంటల్లో 72,049 కేసులు నమోదుకాగా 986 మంది మృతిచెందారు. ఇక ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 67,57,132 దాటగా 9,07,883 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

కరోనాతో 1,04,555 మంది మృతిచెందగా 57,44,694 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో 11,99,857 మందికి కరోనా టెస్టులు చేయగా ఇప్పటివరకు 8,22,71,651 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.