రాష్ట్రంలో 24 గంటల్లో 2,154 కరోనా కేసులు

197
coronavirus

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 2,154 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,04,748కు చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 26,551 యాక్టివ్ కేసులుండగా ఇప్పటి వరకు 1,77,008 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 1189 మంది మృతి చెందారు.

దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంటే తెలంగాణలో 0.58 శాతంగా ఉంది. ఇక రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 86.45 శాతంగా ఉండగా 24 గంటల్లో 54,277 కరోనా టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.