నోయల్‌పై స్వాతి దీక్షిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

402
noel

బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లిన మొదటి వారంలోనే బయటకు వచ్చేసింది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ స్వాతి దీక్షిత్. ఏ పర్పస్ మీద బిగ్ బాస్ హౌస్‌కి తీసుకువచ్చారో తెలియదు కాని మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది స్వాతి దీక్షిత్ ఎంట్రీ.

ఈ నేపథ్యంలో ఇంటి నుండి బయటకు వచ్చిన స్వాతి….ఇంటి సభ్యులు ముఖ్యంగా నోయల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ఇంటి సభ్యుల్లో తనకు నోయల్ అంటే చాలా ఇష్టమని…చాలా మంచి వ్యక్తి, పాజిటివ్ ఎనర్జీతో ఉంటాడని తెలిపిన స్వాతి…చివరి వరకు ఉండే ఐదుగురు సభ్యుల్లో నోయల్ ఒకరని జోస్యం తెలిపింది.

మోనాల్‌ని అఖిల్‌ గుడ్డిగా నమ్మేస్తున్నాడని…అమ్మా రాజశేఖర్ మామూలు వ్యక్తి కాదని.. ఈయన చాలా కంత్రీ అస్సలు నమ్మ కూడదని తెలిపింది. స్వాతి కోసం అమ్మ రాజశేఖర్‌ని ఈ వారం ఎలిమినేషన్‌కు నోయల్ నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో నోయల్‌పై మాస్టర్‌ ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు.