దేశంలో 63 లక్షలు దాటిన కరోనా కేసులు..

262
covid 19

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 63 లక్షలు దాటాయి. రోజుకి 80 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండగా గత 24 గంటల్లో 86,821 పాజిటివ్ కేసులు నమోదుకాగా 1181 మంది మృతిచెందారు.

దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 63,12,585కు చేరగా 9,40,705 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనాతో 98,678 మంది మృతిచెందగా 52,73,201 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు.

దేశంలో కరోనా రికవరీ రేటు 83.33 శాతంగా ఉండగా పాజిటివ్‌ కేసులు 15.11 శాతం ఉన్నాయి. 24 గంటల్లో 14,23,052 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒపకపగొరకు 7,56,19,781 టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.