దేశంలో 61 లక్షలు దాటిన కరోనా కేసులు..

133
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 70,589 కేసులు నమోదుకాగా 776 మంది మృతిచెందారు.

దీంతో ఇప్పటివరకు కేసుల సంఖ్య 61,45,292 దాటింది. ప్రస్తుతం దేశంలో 9,47,576 యాక్టివ్ కేసులుండగా 51,01,398 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. క‌రోనాతో ఇప్పటివరకు 96,318 మంది మృతిచెందారు.

గత 24 గంటల్లో 11,42,811 కరోనా టెస్టులు చేయగా ఇప్ప‌టి వ‌ర‌కు 7,31,10,041 మంది కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.