బిగ్ బాస్‌ 4..ఓటింగ్‌లో టాప్‌లో అభిజిత్

189
bigg boss 4
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 23 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. 4వ వారంలో ఏడుగురు హారిక, స్వాతి దీక్షిత్, అభిజిత్, లాస్య, మెహబూబ్, కుమార్ సాయి, సొహైల్‌ ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు.

ఇక ఇప్పటివరకు 30214 మంది ఓట్లు వేయగా అభిజిత్ టాప్ పొజిషన్‌లో ఉన్నారు. అభిజిత్ 31 శాతం ఓట్లతో టాప్‌లో ఉండగా తర్వాత కుమార్ సామి 15 శాతం,లాస్య 12 శాతం,హారిక 11 శాతం ఓట్లతో ఉన్నారు. మెహబూబ్ 9.85శాతంతో ఉండగా సోహైల్ 9.69 శాతం,స్వాతి దీక్షిత్ 9.20 శాతం ఓట్లతో లీస్ట్‌లో ఉన్నారు.

మొదటివారంలో సూర్యకిరణ్,రెండవ వారంలో కరాటే కళ్యాణి,మూడో వారంలో దేవి నాగవల్లి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు రాగా నాలుగోవారం ఒకరు ఎలిమినేట్ కానున్నారు.

- Advertisement -