దేశంలో 59 లక్షలు దాటిన కరోనా కేసులు..

151
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59 లక్షలు దాటాయి. గ‌త 24 గంట‌ల్లో 85,362 పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా 1089 మంది క‌రోనాతో మృతిచెందారు. దీంతో కరోనా కేసుల సంఖ్య 59,03,933కి చేరాయి.

ప్రస్తుతం దేశంలో 9,60,969 యాక్టివ్ కేసులుండగా 93,379 మంది మృతిచెందారు. 48,49,585 మంది బాధితులు కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 13,1,535 కరోనా టెస్టులు చేయగా ఇప్పటివరకు 7,02,69,975 టెస్టులు నిర్వహించామని ఐసీఎంఆర్ తెలిపింది.