రాష్ట్రంలో 24 గంటల్లో 2239 కరోనా కేసులు..

117
corona

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 83 వేలు దాటాయి. గత 24 గంటల్లో 2,239 కరోనా కేసులు నమోదుకాగా 11 మంది మృతిచెందారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 1,83,866 కరోనా కేసులు నమోదుకాగా 1091 మంది కరోనాతో మృతిచెందారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 30,334 యాక్టివ్ కేసులుండగా 1,52,441 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కోవిడ్‌ మరణాల రేటు 0.59 శాతంగా ఉండగా రికవరీ రేటు 82.90 శాతంగా ఉందని వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు కరోనా టెస్టుల సంఖ్య 28 లక్షలు దాటగా గత 24 గంటల్లో 58,925 టెస్టులు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.