బిగ్ బాస్ 4..వీరిలో ఒకరు బ్యాగ్ సర్దేయనున్నారా..?

174
devi

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 రసవత్తరంగా సాగుతోంది. మూడో వారం ముగిసే సరికి బిగ్ బాస్‌ పై మరింత ఆసక్తిపెంచేశారు హౌస్ మేట్స్‌. ఇక మూడోవారం ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమవుతుండగా నామినేట్ అయిన 7 గురు సభ్యులు కుమార్ సాయి, హారిక, లాస్య,దేవి నాగవల్లి, మెహబూబ్, అరియానా, మొనాల్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

అయితే బిగ్ బాస్‌ని ఫాలో అవుతున్న వారి అంచనాల ప్రకారం ఈ సారి దేవి నాగవల్లి, మెహబూబ్‌లలో ఒకరు బ్యాగ్ సర్దేయడం ఖాయమని చెబుతున్నారు. ఇప్పటివరకు 2 లక్షల 10 వేల మంది ఓటేయగా టాప్ పొజిషన్‌లో కుమార్ సాయి ఉండగా సెకండ్ ప్లేస్‌లో హారిక,మూడోస్ధానంలో లాస్య ఉన్నారు. ఇక చివరి రెండు స్ధానాల్లో మెహబూబ్, దేవి నాగవల్లి ఉన్నారు.ఎందుకంటే ఓటింగ్ పరంగా చూస్తే దేవి నాగవల్లి,హౌస్‌లో అతి చేసేవారిలో మెహబూబ్ ఉండటం ఇందుకు కారణంగా చెబుతున్నారు.

మొదటివారంలో అతిగా ప్ర‌వ‌ర్తించిన ద‌ర్శ‌కుడు సూర్య కిర‌ణ్‌,రెండోవారంలో క‌రాటే క‌ల్యాణి బయటకు పంపించారు. ఈ నేపథ్యంలో ఈ సారి వీరిద్దరిలో ఒకరు బయటకు రావడం ఖాయమని అంతా భావిస్తున్నారు.