దేశంలో 24 గంటల్లో 94 వేల కరోనా కేసులు..

179
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రోజుకు 90 వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో కరోనా కేసుల సంఖ్య 53 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 93,337 మంది క‌రోనా బారిన‌ప‌డగా 1247 మంది మృతిచెందారు.

దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 53,08,015కు చేరగా ఇందులో 10,13,964 మంది క‌రోనా బాధితులు చికిత్స పొందుతుండ‌గా,మ‌రో 42,08,432 మంది కోలుకున్నారు. క‌రోనా బారిన‌ప‌డి మృతిచెందిన‌వారి సంఖ్య 85,619కు పెరిగింది. దేశంలో కరోనా టెస్టుల సంఖ్య 6 కోట్లు దాటాయి.