నిత్యామీనన్‌ గమనం లుక్‌కి మంచిరెస్పాన్స్‌..

226
gamanam
- Advertisement -

లేడీ డైరెక్ట‌ర్ సుజ‌నా రావు డైరెక్ట్ చేస్తోన్న‌ తొలి చిత్రం ‘గ‌మ‌నం’ తెలుగు, త‌మిళ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా ఫిల్మ్‌గా నిర్మాణ‌మ‌వుతోంది. రియ‌ల్ లైఫ్ డ్రామాగా ‘గ‌మ‌నం’ రూపొందుతోంది. గాయ‌ని శైల‌పుత్రీ దేవి అనే ప్ర‌త్యేక పాత్ర పోషిస్తోన్న నిత్యా మీన‌న్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను శుక్ర‌వారం హీరో శ‌ర్వానంద్ ఆవిష్క‌రించారు.

పోస్ట‌ర్‌లో శాస్త్రీయ గాయ‌నిగా ప‌ట్టుచీర ధ‌రించి ఒక క‌చేరీలో గానం చేస్తున్న నిత్యా మీన‌న్ ముఖంలో అంద‌మైన చిరున‌వ్వుతో పాటు ఒక దైవ‌త్వం కూడా గోచ‌రిస్తోంది. క‌థ‌లో నిత్య స్పెష‌ల్ అప్పీరెన్స్ ప్రాధాన్యం ఏమిట‌నేది ఆస‌క్తిక‌రం.నిత్యా లుక్‌కి ప్రేక్షకుల నుండి మంచిరెస్పాన్స్ వస్తోంది.

సాయిమాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు రాస్తున్న ‘గ‌మ‌నం’ చిత్రానికి మేస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతం స‌మ‌కూరుస్తున్నారు.సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తోన్న జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్‌. ఈ చిత్రానికి నిర్మాత‌గానూ వ్య‌వ‌హ‌రిస్తూ, ర‌మేష్ క‌రుటూరి, వెంకీ పుష‌డ‌పు ల‌తో క‌లిసి నిర్మిస్తున్నారు.

- Advertisement -