రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 81.28శాతం..

137
coronavirus

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 70 వేలకు చేరువయ్యాయి. 24 గంటల్లో 2,123 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 9 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 1,69,169కి చేరాయి

రాష్ట్రంలో ప్రస్తుతం 30,636 యాక్టివ్ కేసులుండగా 1,37,508 మంది కరోనా నుండి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 1,025 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.60శాతంగా ఉండగా రికవరీ రేటు 81.28శాతంగా ఉంది.

24 గంటల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 305,రంగారెడ్డి 185, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి 149, నల్గొండ 135, కరీంనగర్‌ 112, సిద్దిపేటలో 87, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 81 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 24,34,409 టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.