దేశంలో 49 లక్షలు దాటిన కరోనా కేసులు..

190
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రోజుకు 90 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండగా కేసుల సంఖ్య 49 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 83,809 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 1054 మంది మరణించారు.

దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 49,30,237కు చేరగా ప్రస్తుతం 9,90,061 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనాతో ఇప్పటివరకు 80,776 మంది మృతిచెందగా 38,59,400 మంది వైరస్‌ నుండి కోలుకున్నారు.

గత 24 గంటల్లో 10,72,845 టెస్టులు చేయగా ఇప్పటి వరకు 5,83,12,273 శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.