బిగ్ బాస్‌ 4…ఓటింగ్‌లో వెనుకబడ్డ గంగవ్వ..!

239
bigg boss telugu

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 9వ ఎపిసోడ్‌ని పూర్తిచేసుకుంది. తొలివారంలో సూర్యకిరణ్ ఎలిమినేట్ కాగా రెండోవారంలో 9 మంది ఎలిమినేషన్‌కు నామినేట్ కాగా యూ ట్యూబ్ స్టార్ గంగవ్వ వరుసగా రెండో వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయింది.

బిగ్ బాస్ టాస్క్‌లో భాగంగా 9 తీరాల్లో 9 మంది ఎలిమినేట్ అవుతారని చెప్పగా తొలుత గంగవ్వ తర్వాత సొహైల్, అమ్మ రాజశేఖర్, కరాటే కళ్యాణి,కుమార్ సాయి, దేత్తడి హారిక, అభిజిత్‌,నోయల్, మొనాల్, సొహైల్ నామినేట్ కాగా వీరిలో ఒకరు ఇంటినుండి బయటకు రానున్నారు.

రెండోవారం ఓటింగ్ అప్పుడే ప్రారంభంకాగా అభిజిత్ 23 శాతం ఓట్లతో తొలిస్ధానంలో ఉండగా గంగవ్వ 21.6 శాతం ఓట్లతో రెండో స్ధానంలో నిలిచింది. తొలివారంలో ఓటింగ్ లో టాప్ పొజిషన్ లో ఉన్న గంగవ్వ రెండోవారంలో వెనుకబడింది. ఇక నోయల్ 11.7 శాతం,మొనాల్ 11.1 శాతం,సోహైల్ 10,కుమార్ సాయి 9,హారిక 7,అమ్మ రాజశేఖర్ 3,కరాటే కల్యాణి 2 శాతం ఓట్లతో ఉన్నారు.